చిరంజీవి మాత్రం సమస్య పరిష్కారానికి కృషి చేశారు: మంత్రి పేర్నినాని

ABN , First Publish Date - 2022-02-10T19:38:02+05:30 IST

ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ మధ్య కొద్ది రోజులుగా తలెత్తిన సంక్షోభానికి తెరపడినట్టే అనిపిస్తోంది.

చిరంజీవి మాత్రం సమస్య పరిష్కారానికి కృషి చేశారు: మంత్రి పేర్నినాని

అమరావతి: ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ మధ్య కొద్ది రోజులుగా తలెత్తిన సంక్షోభానికి గురువారంతో తెరపడినట్టే అనిపిస్తోంది. సీఎం జగన్‌తో జరిగిన చిరంజీవి బృందం భేటీ ముగిసింది. అనంతరం మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు చిరంజీవి కృషి చేశారన్నారు. సినీ సమస్యలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడినా.. మెగాస్టార్ మాత్రం సమస్య పరిష్కారానికి తీవ్ర కృషి చేశారన్నారు. చిన్న సినిమాల మనుగడ ఉండాలని నటుడు నారాయణమూర్తి కోరారన్నారు. ఏపీలో సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్టూడియోల నిర్మాణంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. సరైన ప్రతిపాదనలతో టాలీవుడ్ పెద్దలు రావాలని మంత్రి పేర్నినాని అన్నారు.

Updated Date - 2022-02-10T19:38:02+05:30 IST