హైదరాబాద్: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై మంత్రి కేటీఆర్ అంతర్గత సమీక్ష నిర్వహించారు. కొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వనమోదు తగ్గడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ చేశారు. రసమయి, కోరుకంటి చందర్‌కు కేటీఆర్ చురకలు అంటించారు. వారంలోగా సభ్యత్వం నమోదు పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. తక్కువ సభ్యత్వాలు చేయించిన ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మాట్లాడుతారని కేసీఆర్ చెప్పారు.