దళిత బంధు సత్ఫలితాలు మొదలయ్యాయి

ABN , First Publish Date - 2022-08-01T08:20:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం సత్ఫలితాలను ఇవ్వడం మొదలైందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

దళిత బంధు సత్ఫలితాలు మొదలయ్యాయి

దళిత బంధుపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం సత్ఫలితాలను ఇవ్వడం మొదలైందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆదివారం తన ట్విటర్‌ ఖాతాలో ఈ పథకం లబ్ధిదారుల ఫొటోలను జతచేసి దళిత బంధు అమలు తీరుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అట్టడుగున ఉన్న నిరుపేదలను అభ్యన్నతి వైపు తీసుకెళ్లడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాగా, ‘మానవత్వంతో మీరు చేస్తున్న కార్యక్రమాలను ఆపకండి. సోనూసూద్‌.. మీ సేవా స్ఫూర్తిని అలాగే కొనసాగించండి’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కాంక్షిస్తూ.. ఆయనకు మరింత శక్తి సమకూరాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

Updated Date - 2022-08-01T08:20:28+05:30 IST