మోదీ హయాంలో సబ్ కా సాత్.. సబ్ కా వినాశ్‌: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2022-01-05T22:13:10+05:30 IST

బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభత్వం,

మోదీ హయాంలో సబ్ కా సాత్.. సబ్ కా వినాశ్‌: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మోదీ హయాంలో సబ్ కా సాత్.. సబ్ కా వినాశ్‌ జరిగిందని కేటీఆర్  ధ్వజమెత్తారు. కేసీఆర్ పట్ల జేపీ నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్‌కి, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఏడున్నరేళ్ల పాలనలో కేంద్రంలో బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ రైతు విరోధి అని ఆరోపించారు. రైతులను మోదీ కంటే గోస పెట్టినోళ్లు ఎవరూ లేరన్నారు. అన్నదాతలకు అండగా ఉండేది కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో వడ్లు కొనరు.. ఇక్కడికొచ్చి దీక్షలు, ధర్నాలు చేస్తారని ఆయన ఆరోపించారు. నిన్న రైతులను రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఉద్యోగులను రెచ్చగొట్టారన్నారు. 


మతాల మధ్య చిచ్చుపెట్ఠి ఓట్లు పొందుందుకు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా బీజేపీ, ఈడీ, ఎన్ఐఏ, సీబీఐ ఉన్నాయని అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కొన్ని మీడియా సంస్థలను మోడియాగా మార్చారని కేటీఆర్ ఆరోపించారు. 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 15లక్షల ఖాళీలున్నాయన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్ కాకతీయ గొప్ప పథకాలని మీ నీతిఅయోగ్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రైతుల పంట కొనలేని అసమర్థతకు మీ ఎఫ్‌సీఐకి వచ్చిందని ఆయన ఆరోపించారు. 





Updated Date - 2022-01-05T22:13:10+05:30 IST