Abn logo
Sep 14 2021 @ 19:55PM

"నేను రాజీనామా చేస్తా..మరి నీవు రాజీనామా చేస్తావా": బండికి మంత్రి కేటీఆర్ సవాల్

గద్వాల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పైసులు కేంద్రానివి, సోకులు రాష్ట్రానివి అని సంజయ్ మాట్లాడడం తగదని కేటీఆర్ అన్నారు. "తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా..మరి నీవు ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా" అని బండికి కేటీఆర్ సవాల్  విసిరారు. పన్నుల రూపంలో కేంద్రానికి  తెలంగాణ  ప్రభుత్వం ఏటా 2 లక్షల 77 వేల కోట్ల రూపాయలను కడుతుందన్నారు. కానీ తెలంగాణకు కేంద్రం నుంచి లక్షా 42 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి వెళితే, తిరిగి రాష్ట్రానికి కేంద్రం నుంచి అర్థ రూపాయి మాత్రమే వస్తుందన్నారు.