హైదరాబాద్: ఎంసీహెచ్‌ఆర్డీలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీ రూపొందించారు. తయారీ, పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించేలా నూతన విధానం రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ పాల్గొప్నారు.