గురు కులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం:కొప్పుల

ABN , First Publish Date - 2021-11-18T01:30:41+05:30 IST

గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఎస్సీ వెల్ఫేర్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

గురు కులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం:కొప్పుల

హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఎస్సీ వెల్ఫేర్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని పలు గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కరోనా అనంతరం ప్రారంభమైన పాఠశాలల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికలు, బాలుర పాఠశాలలను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, హాస్టల్ భవనం, మెస్ హాల్, బాత్రూములు కూడా ఆయన తనిఖీ చేశారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, ఇతర సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


ఒకప్పుడు కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అందరికీ కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతోనే గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశారని తెలిపారు. వీటిల్లో చదివిన ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఐటి, ట్రిపుల్ ఐటీప్రతిష్టాత్మక సంస్ధల్లో సీట్లు పొందుతున్నారని తెలిపారు గత సంవత్సరం నిర్వహించిన నీట్ లో పెద్ద సంఖ్యలో విద్యార్ధులు ర్యాంకులనుసాధించారని గుర్తు చేశారు. 

Updated Date - 2021-11-18T01:30:41+05:30 IST