ఎన్డీఏలో వైసీపీ చేరికపై కొడాలి నాని ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2020-02-15T21:49:35+05:30 IST

ఎన్డీఏలో వైసీపీ చేరబోతుందంటూ వస్తున్న వార్తలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. కేంద్రంతో వైసీపీ అధికారం పంచుకోవడం అనేది పార్టీ నుంచో, అధినేత

ఎన్డీఏలో వైసీపీ చేరికపై కొడాలి నాని ఏమన్నారంటే...

విజయవాడ: ఎన్డీఏలో వైసీపీ చేరబోతుందంటూ వస్తున్న వార్తలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. కేంద్రంతో వైసీపీ అధికారం పంచుకోవడం అనేది పార్టీ నుంచో, అధినేత జగన్ నుంచి మాత్రమే స్పష్టమైన ప్రకటన వస్తుందని తెలిపారు. వేరే ఎవరైనా పిచ్చా పాటిగా మాట్లాడితే మాత్రం అది పార్టీ మాట కాదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వలేం వేరే విధంగా సాయం చేస్తామని కేంద్రం చెబుతోందన్నారు. ప్రత్యేక హోదా మాత్రమే ఏపీ అభివృద్ధికి సహకరిస్తుందని వైసీపీ మొదటి నుంచి చెబుతోందని గుర్తుచేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వాలని కోరుతున్నామని వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీకి నాలుగు సీట్లు రానున్నాయన్నారు. అలాగే వచ్చే ఏడాది కూడా ఇంకా మరిన్ని సీట్లు రాజ్యసభలో వస్తాయని చెప్పారు. బీజేపీకి రానున్న రోజుల్లో బిల్లుల ఆమోదం కోసం రాజ్యసభలో మద్దతు అవసరం ఉంటుందన్నారు. ఆ సమయంలో ప్రత్యేక హోదా కోరి కేంద్రానికి సహకరిస్తామని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.


Updated Date - 2020-02-15T21:49:35+05:30 IST