మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్

ABN , First Publish Date - 2022-04-26T19:22:53+05:30 IST

సూర్యాపేటల్లో మోడీ సర్కార్‌పై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు.

మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్

సూర్యాపేట: సూర్యాపేటల్లో మోడీ సర్కార్‌పై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. విద్యుత్ అంశంలో కేంద్రం తెలంగాణా గొంతు నొక్కుతుందని, బీజేపీ సర్కార్ కుట్రలు పరాకాష్టకు చేరాయన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోదీ ఎత్తుగడలని వ్యాఖ్యానించారు. విద్యుత్ కొనుగోళ్లలో కేంద్రానికి, యన్.ఎల్.డి.సి & యస్ఎల్ డిసిల ప్రమేయం ఉండదన్నారు. ఉత్పత్తి దారులకు డిస్కం లేదా ట్రాన్స్కో, జెన్కోల మధ్య కుదిరే ఒప్పందం మాత్రమే అని తెలిపారు. సంబంధం లేకున్నా కేంద్రం తల దూరుస్తుందని, ముమ్మాటికి ఇది కేంద్రం దాదాగిరినే అని మండిపడ్డారు. బీజేపీ పాలకుల దాదాగిరి వీధి రౌడీలను తలపిస్తుందని, కేంద్రం దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. మోదీ సొంత రాష్ట్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో విద్యుత్ సరఫరా చెయ్యలేకనే ఈ కుట్రలని మంత్రి అన్నారు.


గుజరాత్‌లో వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ సరఫరా కూడా చెయ్యలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం గుజరాత్‌తో సహా బీజేపీ పాలిత రాష్ట్రాలలో అదే పరిస్థితి ఉత్పన్నమౌతతుందని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మోకాలోడ్డాలి అన్నది కేంద్రం కుట్ర అని ఆరోపించారు. ఎంత ఖర్చు అయినా సరే విద్యుత్ సరఫరాకు ఆటంకం రానివ్వమని, అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించామని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. 

Updated Date - 2022-04-26T19:22:53+05:30 IST