లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించండి- పుకార్లను నమ్మొద్దు

ABN , First Publish Date - 2020-04-04T23:43:03+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9గంటల నుంచి తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లో లైట్లు ఆర్పేసి స్వచ్చందంగా లాక్‌డౌన్‌కు మద్దతు పలకాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశరు.

లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించండి- పుకార్లను నమ్మొద్దు

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9గంటల నుంచి తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లో లైట్లు ఆర్పేసి స్వచ్చందంగా లాక్‌డౌన్‌కు మద్దతు పలకాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశరు.. దేశ వ్యాప్తంగా లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు పై మంత్రి స్పందించారు. ఈ కార్యక్రమంతో ఏదో జరిగిపోతుందంటూ సోషల్‌ మీడియాలో షికార్లుచేస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. రోజూ నిద్రకుపక్రమించే ముందు లైట్లు బంద్‌చేయడం సహజమేనని అన్నారు. దీని వల్ల గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రోజువారీగా రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు విద్యుత్‌డిమాండ్‌ తగ్గడం కూడా సహజమేనని అన్నారు. కరోనా మీద చేస్తున్న యుద్ధంలో లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించడం ఒక భాగమేనని చెప్పారు. కేవలం ఇండ్లలో వెలిగించే లైట్‌లు బంద్‌చేయాలన్నారు. అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు ఇది వర్తించదన్నారు. ఫ్రిజ్‌లు, ఫ్యాన్‌లు, కూలర్లు,ఏసీలు బంద్‌చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా కట్టడికి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపులో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-04-04T23:43:03+05:30 IST