హైదరాబాద్: భారతదేశం గర్వించదగ్గ మహాగాయని లతా మంగేష్కర్ అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తనకోకిల గానంతో దేశ ప్రజల మనస్సు దోచుకున్నవ్యక్తి లతామంగేష్కర్ అన్నారు. లతా మంగేష్కర్ మరణ పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లతాజీ మృతి దేశానికి తీరని లోటన్నారు. ఎన్నో తరాల పాటు లతాజీ పాటలు గుర్తుండిపోతాయన్నారు. ఆమె సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
ఇవి కూడా చదవండి