రామప్పకు యునెస్కో గుర్తింపు: తెలంగాణకు గర్వకారణం:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-25T23:38:32+05:30 IST

అద్బుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ,

రామప్పకు యునెస్కో గుర్తింపు: తెలంగాణకు గర్వకారణం:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: అద్బుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మన రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకతీయ శిల్పకళా వైభవానికి దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు. కాగా రామప్పకు గుర్తింపు రావ‌డానికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌, ఇత‌ర మంత్రుల‌కు, అధికారుల‌కు  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లె దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు.


సీఎం కేసీఆర్ ప్రోత్స‌హంతోనే ప్ర‌పంచ స్థాయిలో యునేస్కోకు గుర్తింపు ల‌భించిందని ఆయన అన్నారు.ఉమ్మ‌డి రాష్ట్రంలోనే దీనికి యునేస్కో గుర్తింపున‌కు ప్ర‌య‌త్నించిన అప్ప‌టి ప్ర‌భుత్వాల‌కు చిత్త‌శ‌ద్ది లేక‌పోవ‌డం వ‌ల్ల సాధ్యం కాలేదు. రామప్ప చారిత్రక కట్టడాలకు ఎట్టకేలకు యునెస్కో గుర్తింపు లభించడం పట్ల మంత్రి ద‌యాక‌ర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-25T23:38:32+05:30 IST