Abn logo
Sep 17 2021 @ 03:45AM

బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ కనుమరుగైంది: హరీశ్‌ రావు


హుజూరాబాద్‌, సెప్టెంబరు 16: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ శివారులో విశ్మకర్మ మనుమయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అమ్మడం, కుదవపెట్టడం, ఉద్యోగాలు ఊడగొట్టడం, ధరలు పెంచడమే ఎజెండాగా పెట్టుకుందన్నారు. విశ్వకర్మ కులస్థులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. నిన్నటి దాకా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌.. కల్యాణలక్ష్మి పథకాన్ని దండగ అన్నారని, అలాంటి వ్యక్తికి ఓటేస్తారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ కనుమరుగైందని, ఇక్కడున్నవి టీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రమే అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని చెప్పారు. బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదన్నారు.