Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 26 2021 @ 18:00PM

బీజేపీవి కోతలు, వాతలే: హరీష్‌రావు

హైదరాబాద్: బీజేపీపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి  హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోతలు, వాతలు తప్ప బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీలేదని ఆయన ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధర వేయి రూపాయలకు చేరిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.  తెలంగాణ ప్రభుత్వo రూ.500 కోట్లను స్థానిక సంస్థలకు కేటాయించిందని హరీష్‌ తెలిపారు. 


Advertisement
Advertisement