ఎడారిలో ఓయసిస్సులా మల్లన్న సాగర్: మంత్రి హరీష్ రావు

ABN , First Publish Date - 2022-02-24T00:34:16+05:30 IST

ఎడారిలో ఓయసిస్సులా మల్లన్న సాగర్ ప్రాజెక్టు మారిందని మంత్రి

ఎడారిలో ఓయసిస్సులా మల్లన్న సాగర్: మంత్రి హరీష్ రావు

సిద్దిపేట: ఎడారిలో ఓయసిస్సులా మల్లన్న సాగర్ ప్రాజెక్టు మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. మల్లన్న స్వామివారి పేరు మీద తుక్కాపూర్‌లో నిర్మించిన మల్లన్న సాగర్‌ను సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. అనంతరం కొమురవెల్లిలోని మల్లన్న స్వామి వారిని సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తయితే మల్లన్నకు ఐదు కలశాలతో పాదాలు కడుగుతానన్న కోరిక నేడు నెరవేరిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యూనల్‌లో ఎన్ని కేసులు వేసినా, ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డుకట్ట వేసినా మల్లన్న దయవల్ల నిర్మాణం పూర్తయిందన్నారు. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి మల్లన్న సాగర్‌తో నీటి కష్టాలు పోయి ఎడారిలో ఓయసిస్సులా మారిందన్నారు.


సమైక్య పాలనలో తెలంగాణలో నీటి గోస ఉండేదని, కానీ  స్వరాష్ట్రంలో కేసీఆర్ మల్లన్న సాగర్ నిర్మించి ఆ గోసను తీర్చారనన్నారు. సాగు, తాగు నీరు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి నీళ్లను పారిస్తే, బీజేపీ నాయకులు మతాల పేరుతో చిచ్చు పెట్టి రక్తాన్ని పారిస్తున్నారని ఆయన ఆరోపించారు.  ప్రోకెన్లతో ప్రాజెక్టులు నిర్మిస్తే, ఓట్లు వేయకపోతే వాటితో దాడిచేస్తామని బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.

Updated Date - 2022-02-24T00:34:16+05:30 IST