మంత్రి హరీష్‌రావుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-06-03T18:40:29+05:30 IST

మంత్రి హరీష్‌రావుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి హరీష్‌రావుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీష్‌రావు 48వ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ... ‘‘బావా మీరు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో కొనసాగాలి. చిరకాలం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలి. ప్రభుత్వంలో, పార్టీలో మీతో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’’ అంటూ హరీశ్‌రావుపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. డైనమిక్ లీడర్, నిరంతరం శ్రమించే వ్యక్తి అంటూ తన మేన బావను ఆకాశానికి ఎత్తారు.


మాజీ ఎంపీ కవిత, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కూడా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు. హరీష్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ విషెస్  తెలిపారు. అయితే గతేడాది జన్మదిన వేడుకులకు దూరంగా ఉన్న హరీశ్ ఈ సారి కూడా కరోనా నేపథ్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నారు. అభిమానులు స్వీయనియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదని కోరారు.


తెలంగాణ అంతట రక్తదాన శిబిరాలు, నిత్యావసరాలు, పండ్లు పంపిణీ చేస్తూ పలువులు అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొహన్ ఫౌండేషన్ ద్వారా 48 మంది యువకులు అవయవధానానికి ముందుకు వస్తూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. హరీష్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమాని వరంగల్ జిల్లాకు చెందిన కేపి బుచ్చిబాబు వీడియో రూపంలో పాటను రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు.





Updated Date - 2020-06-03T18:40:29+05:30 IST