హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న అనేక పథకాల వల్లనే బీసీలు సగర్వంగా జీవిస్తున్నారని బిసి,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై ప్రధాన మంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో ఉన్న కుటుంబమని అన్నారు.
కేసీఆర్ కుటుంబం వల్లే బీసీలు తెలంగాణలో సగర్వంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు.19 బీసీ గురుకులాల నుండి 281కి పెంచి 1,50,000 మంది బీసీ బిడ్డల్ని చదువిపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు.52 ఇంచుల ప్రదాని చాతి ఎందుకు బీసీలను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.బీసీ మంత్రిత్వశాఖ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ జనగణన ఎందుకు చేయడం లేదన్నారు.హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి విమర్శించడం తప్ప ప్రధాని తెలంగాణకు ఇచ్చింది ఏమీలేదన్నారు.మా మౌనాన్ని అసమర్ధతగా భావించవద్దుని హితవు చెప్పారు.
ఇవి కూడా చదవండి