కార్మికులే సమాజానికి వెన్నెముక: మంత్రి గంగుల కమలాకర్

ABN , First Publish Date - 2022-05-01T21:10:57+05:30 IST

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని, కేంద్రం అవలంబిస్తున్న కార్మీక వ్యతిరేక విధానాలను ఎండ గడుతామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కార్మికులే సమాజానికి వెన్నెముక: మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని, కేంద్రం అవలంబిస్తున్న కార్మీక వ్యతిరేక విధానాలను ఎండ గడుతామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నరు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వేలకొద్దీ కార్మికుల పుట్ట కొదుతుంది, 714 జీవో తో రవాణా రంగ  కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. 714 జీవో కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఆదివారం మేడే వేడుకలలో మంత్రి గంగుల కమలాకర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రవాణా రంగంలోని మోటార్ వెకిల్ చట్టంలో 714 జిఓ..తీసుకు వచ్చి ఆటో డ్రైవర్ల బతుకులను దీన వ్యవస్థ లోకి నెట్టిందని ఆరోపించారు. 


ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని బస్టాండ్ వద్ద కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం,మంచిర్యాల్ చౌరస్తా మినీ ఆటో గూడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి ,కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆటో కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 714 జీవో రద్దు అయ్యే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి పక్షాన పోరాడుతుందని అన్నారు.కార్మికులే  సమాజానికి వెన్నెముక అని,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక ప్రభుత్వమని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు.తెలంగాణ ప్రభుత్వం ఆదాయం పెంచి పేదలకు పంచితే - కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టి పెద్దలకు పెడుతోందని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ వై. సునీల్ రావు ,చల్ల హరిశంకర్ ,అర్ష మల్లేశం ,ఎడ్ల అశోక్ ,మెచినేని అశోక్ రావు   ట్రాలీ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్త్యాల కృష్ణ యాదవ్ ,తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-01T21:10:57+05:30 IST