Abn logo
Mar 26 2020 @ 19:35PM

గాంధీఆస్పత్రిని పూర్తిస్ధాయి కరోనా హాస్పిటల్‌గా మార్చండి- ఈటల

హైదరాబాద్‌: కరోనా వైరస్‌వ్యాప్తిని నిరోధించడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యవాఖ మంత్రి మరోసారి కితాబు ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారిని స్ర్కీన్‌చేయడం,  హోమ్‌క్వారంటైన్‌ ఉన్నవారికి పరీక్షలు చేయడం వంటి కార్యక్రమాలతో పాటు రాష్ట్రం షట్‌డౌన్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో కరోనా వ్యాప్తిని అరికడుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే మన దగ్గర వ్యాప్తిరెండో దశలోకి చే,రుకుందని, గురువారం నాటికి 44 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందన్నారు. ఇందులో ఒక్కరికి పూర్తిగా నయం అయ్యింది. మిగిలిన వారందరూ కోలుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదని మంత్రి ఈటల తెలిపారు. ఇందులో ఇద్దరు ఇద్దరు ప్రైవేట్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్లు ఉన్నారు. తాజాగా దేశంలోనే పలు ప్రాంతాలను వీరు పర్యటించారు. వీరిని కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.


విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా గమనించాలని మంత్రి ఈటల గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని కోరారు. కరోనా వైరస్‌ గురించి తెలిసిన మొదటి రోజు నుండే అన్నివిధాల ముందస్తుజాగ్రత్తలు తీసుకుంటున్న వైద్య ఆరోగ్యశాఖ ఒక వేళ మూడోదశలోకి చేరుకుంటే తీసుకోవల్సిన చర్యలు, మన సన్నద్దతపై మంత్రి సమీక్షించారు. సర్వేలెన్స్‌ పెంచడం ద్వారానే దీనిని అరికట్టగలమని ఆ టీమ్స్‌ను పెంచాలని ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోపనిచేసే వారు, ఆశ వర్కర్లు   ఎక్కడ పనిచేసే వారు అక్కడే ఉండేలా చూడాలన్నారు. సెలువులు పూర్తిగా రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం ఉన్న చోట సిబ్బందికి భోజన,రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావును ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి డేటా ఉండాలన్నారు. వ్యాధి తీవ్ర పెరిగితే అవసరమయ్యే హాస్పిటల్స్‌, సిబ్బంది, వైద్య పరికాలపై చర్చంచారు. గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా చికిత్సకి వినియోగించేలా తయారు చేయాలని చెప్పారు. ఇప్పటికే గాంధీలో చేయాల్సిన ఆపరేషన్‌లను ఉస్మానియా ఆసుపత్రిలో చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మిగతాఅన్ని విభాగాలను  కూడా తరలించాలని కూడా డైరెక్టర్‌ ఆఫ్‌మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేష్‌రెడ్డిని మంత్రి ఈటల ఆదేశించారు. కింగ్‌కోఠి ఆసుపత్రి కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. వీటితో  ఆటు అవసరం అయితే ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ సేవలను వినియోగించుకునేందుకు కాళోజీ యూనివర్శిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందన్నారు. పేషెంట్ల సంఖ్య పెరిగితే ముందుగా అవసరం అయ్యేది పర్సనల్‌ ప్రొటెక్షన్‌కిట్స్‌. వాటిని సాధ్యమైనన్ని ఎక్కువ సమకూర్చుకోవాలని టీఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖరరెడ్డిని ఆదేశించారు. ఐఎఎస్‌ అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన పరికాలు కొనుగోలు చేయాలని అన్నారు. ఐసియూ పరికరాలు, వెంటిలేటర్లను సమకూర్చుకోవాని మంత్రి సూచించారు. మూడో దశలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వెళ్లకూడదనే ఆశిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అన్నీసిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు షట్‌డౌన్‌ను పాటించాలని విజ్ఞప్తిచేశారు. పక్కవారిని కలవకుండా ఉండడమే మనల్ని రక్షిస్తుందన్నారు. 

Advertisement
Advertisement
Advertisement