Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు మంత్రి ఎర్రబెల్లి నివాళి

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాజకీయాలకే వన్నె తెచ్చిన నాయకుడని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన పార్థీవ దేహం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కొద్ది సేపు రోశయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పదవులకే వన్నె తెచ్చిన మంచి నాయకుడు రోశయ్య అని, ఆయన పదవి ఏదైనా, పని ఏదైనా, ప్రజల కోసం, అత్యంత నమ్మకంగా బాధ్యతాయుతంగా నిర్వహించారని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా, మంత్రిగా, ముఖ్యమంత్రి గా, గవర్నర్ గా తమ పరిధి మేరకు ఆయా పదవుల్లో ఒదిగి పోయేవారు.


అనేక సమస్యలను తన అనుభవం, వాక్చాతుర్యంతో చక్కబెట్టిన అపర చాణిక్యుడు రోశయ్య అన్నారు.ఉమ్మడి‌ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సుదీర్ఘంగా ఆర్థిక మంత్రి. 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్య గారిదితన ప్రతిభా పాటవాల తో అందరికీ అప్తుడుగా నిలిచారు.అపార రాజకీయ ప్రజ్ఞాశాలి అయిన రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి ని తెలుపుతున్నానని అన్నారు.

Advertisement
Advertisement