జనగామ జిల్లాలో జోరుగా కోవిడ్ వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2021-12-08T20:36:36+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ భారీ ఎత్తున జరుగుతోంది. పెద్ద సంఖ్యలోప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.ఈ

జనగామ జిల్లాలో జోరుగా కోవిడ్ వ్యాక్సినేషన్

జనగామ: జిల్లాలోని పలు మండలాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ భారీ ఎత్తున జరుగుతోంది. పెద్ద సంఖ్యలోప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.ఈ సందర్భంగా జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామంలో 2వ విడత టీకా కార్యక్రమాన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా అందరికీ 2వ డోస్ టీకాలు అందేలా చూడాలని అధికారులను అదేశించారు. ప్రతి ఒక్కరూ 2 డోసుల టీకాలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కరోనా మరోసారి పలు దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.సామాజిక, భౌతిక దూరం పాటించాలని, మాస్కు లు ధరించాలని సూచించారు.

Updated Date - 2021-12-08T20:36:36+05:30 IST