సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు

ABN , First Publish Date - 2022-02-07T22:46:33+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న జనగామాకు వస్తున్నసందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యనాయకులు పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు

స్టేషన్ ఘనపూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న జనగామాకు వస్తున్నసందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యనాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టేషన్ ఘనపూర్ లో నియోజవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో   పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేషన్ ఘనపూర్, రఘునాథ పల్లి, చిల్పూర్, వెలేరు, జఫర్గడ్, లింగాల ఘనపూర్ మండలాల వారీగా కార్యకర్తలు, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. సభ ఏర్పాట్లపై సమీక్షించారు.


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జనగామదే కాబట్టి ఆరంభం అదిరిపోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఛాలెంజ్ గా, ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి సూచించారు. సీఎం కెసీఆర్ అత్యంత సంతోషపడే విధంగా, ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా జనగామ సభ సక్సెస్ కావాలని అన్నారు.బీజేపీ నేతలు ఏవేవో కూతలు కుస్తున్నరు. వాళ్ళను తిప్పికొట్టే విధంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో తయారు కావాలన్నారు. గ్రామాల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు పులుల్లా ఉండాలని అన్నారు.


ఎమ్మెల్సీపల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ పై కక్ష కట్టిందని అన్నారు.ప్రధాని స్థాయిలో మోదీ చాలా దిగజారి మాట్లాడుతున్నారని,తెలంగాణకు ముందు రాష్ట్రం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? నెర్రెలు బారిన నెల సస్యశ్యామలం అయిందన్న విషయం మర్చిపోయారన్నారు.స్టేషన్ ఘనపూర్ మండల ఇంఛార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సాంబారు సమ్మరావు, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ గుడి వంశిధర్ రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-07T22:46:33+05:30 IST