జగపతి బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-02-12T20:15:45+05:30 IST

సీనియర్ సినిమా నటులు జగపతిబాబు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు.

జగపతి బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: సీనియర్ సినిమా నటులు జగపతిబాబు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ జగపతి బాబు హీరో గా, విలన్ గా, తన గొప్ప నటనతో సినీ ప్రేక్షకులతో అనుబంధాన్ని, అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రత్యేకించి మహిళలు జగపతిబాబును బాగా అభిమానిస్తారు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అభిలషించారు. సుదీర్ఘంగా సినిమాల్లో నటిస్తూ మరింత గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఆయనకు మరిన్ని అవార్డులు, రివార్డులు రావాలని ఆకాంక్షించారు. జగపతి బాబు తనకు చిరకాల మిత్రుడని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2022-02-12T20:15:45+05:30 IST