అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-16T19:31:27+05:30 IST

రాష్ట్రంలోని పలు చోట్ల, వరంగల్ ఉమ్మడి జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో కురుస్తున్న అకాల వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు చోట్ల, వరంగల్ ఉమ్మడి జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో కురుస్తున్న అకాల వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితులను సమీక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.అనుకోని విధంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. 


ఇప్పటికే ఆయా చోట్ల ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. అలాగే, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేసి, అవసరమైతే రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలన్నారు. ప్రజలు ప్రస్తుత వాతావరణానికి తగ్గట్లుగా వ్యవహరించాలని కోరారు. పెద్దలు, పిల్లలను బయటకు రానివ్వవద్దని సూచించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

Updated Date - 2022-01-16T19:31:27+05:30 IST