నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి సీఎంను చూడలేదు: Errabelli

ABN , First Publish Date - 2022-06-04T21:23:31+05:30 IST

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం కెసిఆర్ లాంటి సీఎం ని చూడలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakarao) అన్నారు.

నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి సీఎంను చూడలేదు: Errabelli

కరీంనగర్: తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం కెసిఆర్ లాంటి సీఎం ని చూడలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakarao) అన్నారు.కేసిఆర్ లా రైతులకు దేశంలో ఎవరూ చేయడం లేదు. ఇక్కడ కేసిఆర్ ని విమర్శించే వాళ్లకు సవాల్ చేస్తున్నా...మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? ముక్కు మూతి తెలియని అమిత్ షా ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కేసీఆర్ అల్లూరి సీతారామ రాజు పోరాటం చేశాడట.ఇదీ ప్రతిపక్షాలకు మన రాష్ట్రం పై ఉన్న అవగాహన అని ఎద్దేవా చేశారు.వాళ్ళ మాటలు నమ్మొద్దు. కేంద్రం ఉపాధి హామీ, 15 వ ఆర్థిక సంఘం నిధులు బాకీ పడ్డదని అన్నారు.రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు నయా పైసా బాకీ లేకుండా ఇచ్చింది. అదేదో ధర్నా, దీక్ష చేస్తామని చెప్పిన బండి సంజయ్...నువ్వే చెప్పు నువ్వు దీక్ష ఎవరి మీద చేస్తున్నావు?నీకు ప్రజల మీద చిత్త శుద్ధి ఉంటే, కేంద్రం మీద దీక్ష చేయి అబద్ధాలు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి.బీజేపీ అంటేనే అబద్ధాల పార్టీపల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు బాగుపడ్డాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తున్నాం పారిశుద్ధ్యం పెరిగింది.


5 వ విడత పల్లె ప్రగతి లో భాగంగా కరీం నగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) జెడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ళ విజయ తో కలిసి ప్రారంభించిmeki. ఈ సందర్భంగా మంత్రులు వాలీ బాల్ ఆడారు.క్రీడా ప్రాంగణ0లో మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి సభలో మంత్రులు మాట్లాడారు సీఎం కెసిఆర్ మనకు అదృష్టం రోగాలు మటు మాయం అయ్యాయి జీపీలు వాళ్లకు ఇష్టం వచ్చిన పనులు చేసుకునే అవకాశం కల్పించాము.తెలంగాణ ను తెచ్చింది సీఎం కెసిఆర్. కాంగ్రెస్ కాదు .దేశానికి గాంధీ స్వాతంత్య్రాన్ని తెస్తే, తెలంగాణ కు స్వాతంత్ర్యాన్ని తెచ్చింది తెలంగాణ గాంధీ కేసిఆర్ అన్నారు.మనమంతా అండగా ఉండాలి.మహిళలు మంచి ప్రాజెక్ట్ తో వస్తె వాళ్లకు స్త్రీ నిధి నుంచి డబ్బులు ఇప్పిస్తామని మల్కా పూర్ ఇప్పటికే 5 కోట్ల రోడ్లు ఇచ్చాం. మరిన్ని పనులకు కావల్సినన్ని నిధులు ఇస్తానని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి పల్లె లో పండుగ లా ఉంది.పల్లె ప్రగతి సాధించిన ప్రగతి ఎంతో ఉందన్నారు. 

Updated Date - 2022-06-04T21:23:31+05:30 IST