ఉపాధి హామీ పధకంతో నిరుపేద కూలీలకు వెలుగు: మంత్రి Errabelli

ABN , First Publish Date - 2022-06-03T20:45:36+05:30 IST

తెలంగాణలో ఉపాధి హామీ పధకం ద్వారా ఎంతో కూలీలకు పనులు కల్పిస్తున్నామని, వారంతా సంతోషంగా వున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabell dayakar rao) అన్నారు.

ఉపాధి హామీ పధకంతో నిరుపేద కూలీలకు వెలుగు: మంత్రి Errabelli

వరంగల్: తెలంగాణలో ఉపాధి హామీ పధకం ద్వారా ఎంతో కూలీలకు పనులు కల్పిస్తున్నామని, వారంతా సంతోషంగా వున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabell dayakar rao) అన్నారు. ఈ పథకం ద్వారా వేలాది మంది కూలీలకు పని కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన పల్లి గ్రామ శివారు చెరువులో ఉపాధి హామీ పథకం కింద చెరువు పూడిక పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  వారితో కలిసి గడ్డపార పట్టి మట్టిని తవ్విన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి సమస్యల పరిష్కలనుతప్పకుండా పరిష్కరిస్తామని అన్నరు,.ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును కూలీలను అడిగి తెలుసుకున్నారు.వారికి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు.పనులు జరుగుతున్న తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు.కూలీలు, అధికారులను మంత్రి అభినందించారు.  ఈకార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-03T20:45:36+05:30 IST