అమరులకు నివాళులర్పించిన మంత్రి errabelli

ABN , First Publish Date - 2022-06-02T20:20:20+05:30 IST

లంగాణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరులను ఈ గడ్డ ఎన్నడూ మర్చిపోదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.

అమరులకు నివాళులర్పించిన మంత్రి errabelli

వరంగల్: తెలంగాణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరులను ఈ గడ్డ ఎన్నడూ మర్చిపోదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా(telangana formation day) మంత్రి వరంగల్ కోట లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్ర అవ‌త‌ర‌ణ కోసం ప్రాణాలు అర్పించిన అమ‌రుల‌కు పుష్పాంజ‌లితోనే సరిపోదని, వారిని ఎన్నటికీ మరువరాదని అన్నారు. నీళ్ళు, నిధులు, నియామ‌కాలు నిజ‌మ‌వుతున్న ఈ సంద‌ర్భం వారికి నిజ‌మైన నివాళిగా భావిస్తున్నానని చెప్పారు.తెలంగాణ ప్రజల 60 ఏండ్ల క‌ల‌ను క‌ల్వకుంట్ల  చంద్రశేఖ‌ర్ రావు నాయ‌క‌త్వంలో సాధించుకున్నామన్నారు.


 స‌క‌ల జ‌నుల, 14 ఏండ్ల శాంతియుత పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమ నేతే సీఎం కావ‌డం రాష్ట్రానికి వ‌రంగా మారింది. మ‌నం ముందుచూపుతో దేశంలో ఎక్కడా లేని అద్భుత ప‌థ‌కాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నాం. తెలంగాణ‌కు ఉజ్వల భ‌విష్యత్తు ఉండే విధంగా చేప‌ట్టిన ప్రణాళిక‌ల‌న్నీ మంచి ఫ‌లితాలిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సాధిస్తున్న విజ‌యాల‌న్నీ తెలంగాణ బిడ్డలుగా మ‌నంద‌రికీ గ‌ర్వకార‌ణమన్నారు.75 ఏండ్ల స్వాతంత్య్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవ‌లం 8 ఏండ్లు! ఈ అన‌తి కాలంలోనే సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అద్భుత విజ‌యాలు సాధించింద‌ని మంత్రి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఊహ‌కు కూడా అంద‌ని ఆద‌ర్శవంత‌మైన ప‌థ‌కాల అమ‌లుతో, తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.  

Updated Date - 2022-06-02T20:20:20+05:30 IST