హన్మకొండ: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(NTR) శత జయంతి సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayalkar rao) శనివారం హనుమకొండ లోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ విఖ్యాత నటుడిగా, ఆ తర్వాత పరిపాలకుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.పేదల పెన్నిధి,రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు.ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేత ఎన్టీఆర్ అని, దేశానికి ఆయన సేవలు చీర స్మరణీయమని అన్నారు. ఎన్టీరామారావు ఆశయాలను కొనసాగించడమే ఆయనకి మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు.
ఇవి కూడా చదవండి