Kcr రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నమహానుభావుడు కేసిఆర్: Errabelli

ABN , First Publish Date - 2022-05-17T20:16:45+05:30 IST

తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.

Kcr రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నమహానుభావుడు కేసిఆర్: Errabelli

వరంగల్: తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? అనే విషయం పై ఆయన పూర్తి అవగాహన వుందని, అందుకే రైతులు లాభదాయక పంటలను వేసేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. బుధవారం వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తోపాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ఆదేశానుసారం ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.


 ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? అనేది చాలా ముఖ్యం.గతంలో కొందరు వరి విషయంలో రైతులను మోసం చేశారు.చివరకు సీఎం కెసిఆర్ 3 వేల కోట్ల నష్టం వస్తున్న సరే, మళ్ళీ వడ్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారుకానీ, మనం, ప్రభుత్వం, అధికారులు రైతులను సరైన దిశగా నడిపించాలన్నారు.రైతుల కోసం ఏదైనా పార్టీ మాట్లాడుతున్నారా?ఆ పరిస్థితులు లేకుండా చేసిన మహానుభావుడు సీఎం కేసిఆర్అని అన్నారు.రైతుల కోసం ఇన్ని సదుపాయాలు కల్పించిన వారు ఎవరూ లేరన్నారు. లాభసాటి సాగు పై ముందుగానే ముందుచూపుతో సిద్ధం చేయాలన్నారు.ఆయిల్ పామ్ లాభసాటిగా ఉంది. దిగుబడి ఎక్కువ, పెట్టుబడి తక్కువ ఉన్నదన్నారు.కొన్ని పార్టీలు రైతులను మభ్య పెట్టే హామీలు ఇస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.వాళ్లు పాలించే రాష్ట్రాల్లో చేయని హామీ తెలంగాణలో ఎలా సాధ్యం? అన్నారు. 


కాంగ్రెస్, బీజేపీ కుట్ర పూరిత హామీలను రైతులు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. ఈసందర్భంగామంత్రి సత్యవతి రాథోడ్(satyavati rathore) మాట్లాడేతూ ఆరోజు,దేశంలో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సాగు నీటి తో పాటు ఎదురు పెట్టుబడులు కూడా ఇస్తున్నాం.తెలంగాణ రాష్ట్రం అన్ని పంటలకు అనువుగా ఉందని చెప్పారు.రైతులు కేవలం వరి వేయకుండా లాభసాటి పంటల సాగు పై దృష్టి పెట్టాలన్నారు.మిర్చిలాంటి వాణిజ్య పంటలను ఆలోచించాలన్నారు. మిర్చి ఈసారి 55 వేలు పలికిందన్నారు.తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి, లాభం వచ్చే పంటల వైపు రైతులను మల్లించాలన్నారు. 



ఈ సందర్భంగా రైతు బంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rejeshwar reddy)మాట్లాడుతూ వ్యవసాయనికి దశ, దిశా కెసిఆర్ కల్పించారన్నారు. బడ్జెట్ లో 30 వేల కోట్లు వ్యవసాయ శాఖకు  కేటాయించారు.ఆనాడు, ఈనాడు పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు.ఇంకా మరింత అభివృద్ధి దిశగా వ్యవసాయాన్ని కొనసాగించడం మీద సీఎం కెసిఆర్ దృష్టి పెట్టారని తెలిపారు.  ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంపీలు మాలోతు కవిత, దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ముదిరాజ్, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు గోపి, శశాంక్, భవేష్ మిశ్రా, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T20:16:45+05:30 IST