ఆదాయం పడిపోయినా సంక్షేమ పథకాలను కేసీఆర్ ఆపలేదు:ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-02-27T22:51:47+05:30 IST

కరోనా ఎఫెక్ట్ తో ఆదాయం పడిపోయినా, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఆపలేదని,

ఆదాయం పడిపోయినా సంక్షేమ పథకాలను కేసీఆర్ ఆపలేదు:ఎర్రబెల్లి

వరంగల్: కరోనా ఎఫెక్ట్ తో ఆదాయం పడిపోయినా, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఆపలేదని, ఎన్నికల హామీలో చెప్పిన, చెప్పని అనేక పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ - హన్మకొండ - కిషన్ పురా లోని మాస్టర్జీ గర్ల్స్ హై స్కూల్ లో జరిగిన ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్ల పట్టభ్రదుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, వరంగల్ మహా నగరానికి ఈ వచ్చే ఉగాది నుంచి ఇంటింటికీ నల్లా ల ద్వారా ప్రతి రోజూ నీళ్ళు ఇవ్వబోతున్నామని తెలిపారు.


నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెపారు. అదే కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉన్నాయా? పైగా ఘోరమైన రైతు వ్యతిరేక పథకాలు తెస్తున్నది. మన రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే, దేశంలో బీజేపీ పండుగ చేయాల్సిన వ్యవసాయాన్ని దండుగ చేస్తున్నదని ఆరోపించారు. ఉద్యోగాలు వచ్చాయా? మన ఖాతాల్లో 15 లక్షలు పడ్డాయా? పల్లా రాజేశ్వర్ రెడ్డి మంచి వ్యక్తి, విద్యాధికులు, ఆయనకు మీ ఓటు వేయడమే కాకుండా, మీ మిత్రుల ఓట్లు కూడా వేయించండని కోరారు. 


ఈ కార్యసమా వేశంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జి సుందర్ రాజ్ యాదవ్, పులి సారంగపాణి, వరంగల్ మార్కెట్ చైర్మన్ చింతమ్ సదానందం, గ్రాడ్యుయేట్ లు తదితరులు హాజరయారు. 






పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 1 లక్షా 32 వేల 899 ఉద్యోగాలు ఇచ్చినo. మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత మరి కొన్ని అద్భుత పథకాలు మొదలు కానున్నాయి. సీఎం కేసిఆర్ సబ్బండ వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదు. ఇలా అందరికీ అన్ని విధాలుగా మేలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో లేదు. నాకు ఓటు వేయండి. నేను మీ అందరి తరపున కౌన్సిల్ లో ఉంటాను. అన్నారు.


ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, సీఎం కేసిఆర్ అన్ని విధాలుగా ప్రత్యర్థుల కంటే మెరుగైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మనకు గ్రాడ్యుయేట్ ల అభ్యర్థిగా ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-02-27T22:51:47+05:30 IST