విదేశాల్లోనూ మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు

ABN , First Publish Date - 2020-07-05T22:02:06+05:30 IST

రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావుకు దేశ, విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు.

విదేశాల్లోనూ మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్‌: రాష్ట్రపంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావుకు దేశ, విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఆయా ప్రాంతాల్లో స్వాగ తం పలుకుతుంటారు. శనివారం ఆయన జన్మదిన వేడుకలు తెలంగాణలోని పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కాగా విదేశాల్లోనూ ఆయన అభిమానులు ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయనకు అభిమానులు అధికంగా ఉన్న అమెరికాలోని మిడ్‌వెస్ట్‌ ఇంచార్జీ అల్లంనేని నిరంజన్‌ ఆధ్వర్యంలో కేకట్‌కట్‌చేసి ఘనంగా జన్మదినవేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. కిరణ్‌లింగాల, డా. నవీన్‌కుమార్‌అనంతా, సుమన్‌రెడ్డి, వాణి ప్రసాద్‌ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అమెరికాలో తన పుట్టిన రోజు వేడుకులు నిర్వహించిన తన అభిమానులకు ధన్యవాదాలుతెలిపారు. 

Updated Date - 2020-07-05T22:02:06+05:30 IST