నియోజకవర్గానికి ఓ మోడల్‌ కాలనీ: మంత్రి

ABN , First Publish Date - 2021-04-16T10:28:33+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్‌ కాలనీని నిర్మించాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గానికి ఓ మోడల్‌ కాలనీ: మంత్రి

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్‌ కాలనీని నిర్మించాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. మే 3 నుంచి ముహూర్తాలకు మంచి రోజులు వస్తున్నందున, లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వస్తారన్నారు. ఈలోగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని స్పష్టం చేశారు. నిర్మాణాలకు అవసరమైన మంచినీరు, విద్యుత్‌, రహదారులు వెంటనే అందుబాటులోకి రావాలన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల కోసం ఇటీవల ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని, అందులో రూ.13 కోట్లు లబ్ధిదారులకు చేరాయని, మిగతావి చెల్లించాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు. సమావేశంలో చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీరాములు, ఇతర అధికారులు జయరామాచారి, అన్నపూర్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T10:28:33+05:30 IST