ఏపీని అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో చేర్చే దిశగా.. : అవంతి

ABN , First Publish Date - 2020-09-26T23:27:26+05:30 IST

ఆంద్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో చేర్చే దిశగా ముందుకెళ్తున్నామని ..

ఏపీని అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో చేర్చే దిశగా.. : అవంతి

విశాఖపట్నం : ఆంద్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో చేర్చే దిశగా ముందుకెళ్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శనివారం నాడు విశాఖలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. పర్యాటక దినోత్సవంపై మాట్లాడారు. విశాఖలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అవంతి తెలిపారు.


కరోనా కారణంగా పర్యాటకశాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. బోటు ప్రమాదాలు తగ్గించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పర్యాటకులను పర్యాటక ప్రాంతాల్లో అనుమతిస్తున్నామని.. రిషికొండ బీచ్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.


ఈ సందర్భంగా చంద్రబాబు గురించి మాట్లాడిన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ దేవుడిని ప్రగాఢంగా నమ్ముతారన్నారు. అయితే కొంత మంది నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవాలయాపై దాడులు జరగడం దుర్మార్గమన్నారు.

Updated Date - 2020-09-26T23:27:26+05:30 IST