జాతీయ జెండా ఎగురుతుంటే ఆ ఆనందం చెప్పలేనిది: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-08-06T04:15:03+05:30 IST

జాతీయ జెండా ఎగురుతుంటే ఆ ఆనందం చెప్పలేనిది: మంత్రి అవంతి

జాతీయ జెండా ఎగురుతుంటే ఆ ఆనందం చెప్పలేనిది: మంత్రి అవంతి

విజయవాడ: జాతీయ జెండా ఎగురుతూ ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తెలుగు అమ్మాయి ఒలంపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. చిన్న వయసులోనే రెండు మెడల్స్ తీసుకురావడం దేశానికి గర్వకారణమని చెప్పారు. యువతకి సింధు రోల్ మెడల్‌గా నిలుస్తుందన్నారు. సింధును ఆదర్శంగా తీసుకొని యువత భావిష్యత్తులో రాణించాలని పిలుపునిచ్చారు. సింధుకి విశాఖలో అకాడమీకి సీఎం జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారని మంత్రి శ్రీనివాస్ గుర్తు చేశారు. 


Updated Date - 2021-08-06T04:15:03+05:30 IST