కోనసీమ : అమలాపురంలో విధ్వంసం వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోంది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యేల ఇళ్లకు పక్కా ప్రణాళికతోనే నిప్పు పెట్టారని సమాచారం. కీలక నేత అనుచరులే నిప్పు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురం ముట్టడికి.. కేవలం 406 మంది పోలీసులతో భద్రత నిర్వహించారు. కాగా.. మూడు వేలకు పైనే ఆందోళనకారులు వచ్చినట్లు గుర్తించారు. విధ్వంసం తర్వాత మరో 955 మంది పోలీసులను తరలించారు. దాడి వెనుక సర్కారు కీలక నేతల సూచనలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్వయంగా మంత్రి విశ్వరూపే విధ్వంసం వెనుక వైసీపీ నేత హస్తం ఉందన్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలూ తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.