విద్యార్థుల అస్వస్థతపై వైద్యులతో మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్

ABN , First Publish Date - 2021-12-06T19:45:55+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో మాట్లాడారు.

విద్యార్థుల అస్వస్థతపై వైద్యులతో మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి : కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ అధికారులతో మాట్లాడారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో 14 మంది విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతో అస్వస్థతకు గురైనట్టు అధికారులు తెలిపారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి నివేదిక కోరారు. వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-12-06T19:45:55+05:30 IST