నేడు మదనపల్లెలో మినీ మహానాడు

ABN , First Publish Date - 2022-07-06T08:41:12+05:30 IST

తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరగనుంది. కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

నేడు మదనపల్లెలో మినీ మహానాడు

హాజరు కానున్న చంద్రబాబు.. భారీగా ఏర్పాట్లు


రాయచోటి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరగనుంది. కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అఽధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, రాజంపేట టీడీపీ నాయకుడు గంటా నరహరి, మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జ్‌ దొమ్మలపాటి రమేశ్‌ మినీ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మదనపల్లె బైపాస్‌ రోడ్డు పక్కన సుమారు 45 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, డీఎస్పీ రవి మనోహారాచారి సభాస్థలిని మంగళవారం పరిశీలించి బందోబస్తుపై నిర్వాహకులతో చర్చించారు.  


చంద్రబాబు పర్యటన సాగేదిలా..

బుధవారం నుంచి చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10.45 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగుళూరు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 4 గంటలకు మదనపల్లె చేరుకుని మినీ మహానాడులో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు మదనపల్లె నుంచి రోడ్డు మార్గాన కలికిరి హేమాచారి కల్యాణ మండపానికి రాత్రి 8 గంటలకు చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం అక్కడ జరిగే అన్నమయ్య జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు.

Updated Date - 2022-07-06T08:41:12+05:30 IST