కరోనా కష్టకాలంలో.. మిలాప్ 90కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-05-05T22:48:23+05:30 IST

కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం సతమతమవుతోంది.

కరోనా కష్టకాలంలో.. మిలాప్ 90కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు

హైదరాబాద్: కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం సతమతమవుతోంది. ఈ క్రమంలో దక్షిణాదిలో అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ వేదిక మిలాప్.. పేదలకు అండగా నిలిచింది. మార్చి 22న కరోనా కరోనా బాధితులను ఆదుకోవడానికి తమ వెబ్‌సైట్‌ను తెరిచింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సుమారు రూ.90కోట్ల విరాళాలు సేకరించింది. వీటిని రోజువారీ కూలీల నిత్యావసరాల కోసం, కమ్యూనిటీ కిచెన్‌ల ద్వారా ఆహారాన్ని అందించడానికి ఉపయోగించనుంది. అంతేగాక ట్రాన్స్ జెండర్లు, సర్కస్ ఆర్టిస్టులు, డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్‌లు, గ్రామీణ కళాకారులు, డ్యాన్సర్లు, ఫ్రీలాన్స్ వర్కర్లు వంటి వారికి కూడా సాయం అందించనున్నామని మిలాప్ తెలిపింది. చెన్నై, అసోం, కేరళల్లో వరదలు వచ్చినప్పుడు కూడా తమ వేదిక ప్రజలు ఏకం చేసిందని, ఈ విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలిచిందని మిలాప్ కో-ఫౌండర్, అధ్యక్షుడు అనోజ్ విశ్వనాథన్ తెలిపారు. కోరో, సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ చైర్మన్ లూయిస్ మిరండా కూడా మిలాప్ ద్వారా ఓ ఫండ్ రైజర్‌ను ఆరంభించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చిందని, మిలాప్ ద్వారా ఈ పని ఆరంభించినందుకు చాలా సంతోషంగా ఉందని లూయిస్ చెప్పారు. ఈ సందర్భంగా మిలాప్ సీఈవో మయూఖ్ చౌదరి మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో విరాళాలు అందించిన దాదాపు 1.6లక్షల మంది దాతలకు, 3వేలకుపైగా సేవా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-05-05T22:48:23+05:30 IST