Windows 11: లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్

ABN , First Publish Date - 2021-06-25T05:24:56+05:30 IST

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం ఓ కార్యక్రమంలో డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10 తదుపరి వర్షన్ విండోస్ 11ను అఫీషియల్‌గా లాంచ్ చేసింది. విండోస్ 10తో పోల్చి చూస్తే విండోస్ 11 లుక్ కొత్తగా ఉంటుం

Windows 11: లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం ఓ కార్యక్రమంలో డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10 తదుపరి వర్షన్ విండోస్ 11ను అఫీషియల్‌గా లాంచ్ చేసింది. విండోస్ 10తో పోల్చి చూస్తే విండోస్ 11 లుక్ కొత్తగా ఉంటుందని వార్తలు వొచ్చిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ ఆ వార్తలను నిజం చేసింది. విండోస్ 11 వెర్షన్‌లో విండోస్ 10లో ఉన్న మాదిరిగా లైవ్ టైల్స్ లేవు. లైవ్ టైల్స్ లేకుండానే విండోస్ 11వర్షన్‌లో స్టార్ట్ మెనూ ఉంది. అదే విధంగా టాస్క్‌బార్‌లో ఐకాన్స్‌ స్థానాన్ని చివరి నుంచి మధ్యలోకి తీసుకొచ్చింది. మొత్తానికి విండోస్ 10తో పోల్చితే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం డిఫరెంట్ లుక్ ఉంది. ఇదిలా ఉంటే.. విండోస్ 10 ఓస్‌ను మైక్రోసాఫ్ట్ 2015లో అందుబాటులోకి తెల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరు సంవత్సరాల తర్వాత విండోస్ 11గా పిలిచే కొత్త ఓస్‌ను మైక్రోసాఫ్ట్ తాజాగా లాంచ్ చేసింది. 


Updated Date - 2021-06-25T05:24:56+05:30 IST