రూ.3.20 లక్షల కోట్ల పెట్టుబడితో ‘చిప్‌’ తయారీ ప్లాంట్‌

ABN , First Publish Date - 2022-08-10T05:54:10+05:30 IST

అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల (మెమొరీ చిప్‌) తయారీ సంస్థ మైక్రాన్‌ టెక్నాలజీస్‌.. 4,000 కోట్ల డాలర్ల (రూ.3.20 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో స్వదేశంలో చిప్‌ల తయారీ ప్లాంట్‌ను

రూ.3.20 లక్షల కోట్ల పెట్టుబడితో ‘చిప్‌’ తయారీ ప్లాంట్‌

అమెరికాలో ఏర్పాటు చేయనున్న మైక్రాన్‌ టెక్నాలజీస్‌ 

చిప్స్‌ అండ్‌ సైన్స్‌ చట్టాన్ని ప్రవేశపెట్టిన యూఎస్‌  


వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల (మెమొరీ చిప్‌) తయారీ సంస్థ మైక్రాన్‌ టెక్నాలజీస్‌.. 4,000 కోట్ల డాలర్ల (రూ.3.20 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో స్వదేశంలో చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చిప్స్‌ అండ్‌ సైన్స్‌ చట్టం ద్వారా లభించే గ్రాంట్స్‌, క్రెడిట్స్‌ మద్దతుతో 2030 వరకు ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ప్లాంట్‌ ద్వారా 40 వేల ఉద్యోగాల కల్పన జరగనుందని మైక్రాన్‌ టెక్నాలజీస్‌ సీఈఓ, భారతీయ సంతతి వ్యక్తి సంజయ్‌ మెహ్రోత్రా తెలిపారు. ఈ ప్లాంట్‌లో 2025 తర్వాత ఉత్పత్తి ప్రారంభం కావచ్చని కంపెనీ భావిస్తోంది. మైక్రాన్‌ టెక్నాలజీస్‌ హైదరాబాద్‌, బెంగళూరులోనూ డెవల్‌పమెంట్‌ సెంటర్లను నిర్వహిస్తోంది. మెమొరీ చిప్‌ల తయారీలో చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు అమెరికా చిప్స్‌ అండ్‌ సైన్స్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం సంతకం చేశారు. 

Updated Date - 2022-08-10T05:54:10+05:30 IST