Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Saginaw: మిచిగాన్ సాగినాలో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు

twitter-iconwatsapp-iconfb-icon
Saginaw: మిచిగాన్ సాగినాలో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు

ఉత్తరమెరికాలోని మిచిగాన్ స్టేట్, సాగినాలో సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట చాలా వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అఖండ దీపారాధన, అంకురార్పణ, పంచగవ్య ప్రాషణ, వాస్తు మంటపారాధనలతో పాటు, సాయిబాబా, దత్తాత్రేయ, నవగ్రహ హోమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ "బ్రహ్మశ్రీ” భాగవతుల యుగంధర శర్మ (కూచిపూడి) ఆధ్వర్యంలో ముగ్గురు పూజారులు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టలో భాగంగా యుగంధర శర్మ అలంకరించిన సర్వతో భద్రమండల సకల దేవతారాధన విశేషంగా ఆకట్టుకున్నాయి. శర్మ హొమారాధనలో పాల్గొన్న భక్తులకు సంస్కృతంలోని వేద మంత్రాలను తెలుగులో అనువదించడం చాలా అభినందనీయం. మూడు రోజుల పాటు సాయి నామ కీర్తనలు, మంత్రోసచ్ఛారణతో సాయి సమాజ్ ఆఫ్ సాగినా ప్రతిధ్వనించింది.  జనవరిలో కేవలం నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించిన సాయి బాబా ధ్యాన మందిరం ఎనిమిది నెలల్లో దేవాలయంగా రూపుదిద్దుకునేందుకు చాలా ఆనందంగా ఉందని సాయి సమాజ్ ఆఫ్ సాగినా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మురళీ గింజుపల్లి అభిప్రాయ పడ్డారు. 

Saginaw: మిచిగాన్ సాగినాలో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు

ఈ ఆలయ నిర్వహణలో ప్రతి రోజు సహకరించిన శ్రీనివాస్ వేమూరి, హరిచరణ్ మట్టుపల్లి, శ్రీధర్ గింజుపల్లి, సాంబశివరావు, కొర్రపాటి, లీలా పాలడుగు, లక్ష్మి మట్టుపల్లి, కృష్ణ జన్మంచికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ సాయి బాబా విగ్రహాన్ని తన స్వంత ఖర్చులతో రాజస్థాన్ నుంచి తెప్పించిన వేమూరి నీలిమ-శ్రీనివాస్ దంపతులకు భక్తులందరు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గింజుపల్లి మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి గురువారం ప్రవాస భారతీయులందరు కలిసి భక్తి శ్రద్దలతో సాయిబాబా హారతులు, భజనలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిష్టాత్మక  కార్యక్రమం ఇంత వైభవంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న పదిహేడు వేల చదరపు అడుగుల స్థలంలో భవిష్యత్తులో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాయిబాబా ఆలయం నిర్మించే ఆలొచనలో ఉన్నామన్నారు. 

Saginaw: మిచిగాన్ సాగినాలో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు

మూడు రోజుల ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం, సాయంత్రం సుమారు మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని నీలిమ శ్రీనివాస్ వేమూరి, సెల్వి విష్ణు కుమార్, తనూజ శ్రీనివాస్ వడ్డమాని, మోనికా మహేష్ భుతి, పల్లవి అమిత్ షహసానె, రోహిణి జితేంద్ర వైద్య, శుభ రఘు మెల్గిరి, కల్పన మురళీ తమ్మినాన, సుజని మురళీ గింజుపల్లి, హేమమాలిని మహేష్ సమతం, నికిత రాహుల్ గుప్త నిర్వహించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మిచిగన్‌లో స్థిరపడ్డ భారత సంతతి వైద్యులు డాక్టర్ కె.పి. కరుణాకరన్-లక్ష్మి, రఘురాం సర్వేపల్లి, నరేంద్రకుమార్, కిశోర్ బాబు- సామ్రాజ్యం కొండపనేని, సుబ్బారావ్-వాణి శ్రీ చావలి, సుబ్రహ్మణ్యం-సుందర యాదం, అనిరుధ్-విద్య భండివార్, విజయా రావ్‌తో పాటు డెట్రాయిట్, ఫ్లింట్, గ్రాండ్ రాపిడ్స్, మిడ్ ల్యాండ్, బేసిటి, సాగినా, కెనడాల నుండి సుమారు ఐదు వందల మంది ప్రవాస భారతీయులు హజరయ్యారు.  సుపరిచయ సుప్రసిద్ధ గాయకుడు మనో ఈ వేడుకలకు హాజరయ్యారు. సుమారు ఎనిమిది వందల భక్తులు భక్తి శ్రద్దలతో పాల్గొని ఘనంగా మూడు రోజుల వేడుకలు సమాప్తమైనది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.