ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి మెసేజ్‌ల వివాదం

ABN , First Publish Date - 2020-10-25T01:46:36+05:30 IST

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నిమ్మగడ్డ పదవిలో ఉండేది కొన్ని నెలలేనని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి మెసేజ్‌ల వివాదం

అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ప్రభుత్వం మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. నిమ్మగడ్డ పదవిలో ఉండేది కొన్ని నెలలేనని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు పెట్టాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని, ఎస్ఈసీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటే కుదరదని కొడాలి నాని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారం సమసిపోకముందే ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య మరో వివాదం చోటుచేసుకుంది. రమేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి మెసేజ్‌ల వివాదం నెలకొంది. సోమవారం సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద జరిగే సమావేశానికి హాజరుకావాలని సీఎస్‌ నీలం సాహ్ని నుంచి ఎస్‌ఈసీకి మెసేజ్ వచ్చింది. దీనిపై ఎస్‌ఈసీ అసిస్టెంట్ సెక్రటరీ ఘాటుగా సమాధానమిచ్చారు. ఎన్నికల కమిషనర్ హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉంటారని, మెసేజ్ పంపడం.. ఆదేశాలివ్వడం న్యాయసమ్మతం కాదని అసిస్టెంట్‌ సెక్రటరీ తప్పుబట్టారు. ఈ విషయాన్ని న్యాయాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అసిస్టెంట్‌ సెక్రటరీ తెలిపారు. తనకు తెలియకుండా సమావేశాలకు వెళ్లవద్దని, తన కార్యదర్శిని రమేష్‌ కుమార్ ఆదేశించారు. 26 నుంచి విజయవాడలో అందుబాటులో ఉంటానని కార్యదర్శికి నిమ్మగడ్డ తెలిపారు.


స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది. అందుకే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైసీపీయేతర పక్షాలన్నీ గత ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఎస్‌ఈసీని నిలదీసే అవకాశముంది. ఎన్నికల కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిషికేషన్‌ ఇవ్వాలని విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. 


సర్పంచ్‌ ఎన్నికలపై ఫిబ్రవరిలో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌కు కాలం చెల్లడంతో ప్రభుత్వం ఇటీవల మరోసారి ఆర్డినెన్స్‌ జారీచేసింది. గత అ సెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టరూపమిచ్చేందుకు బిల్లు తెచ్చింది. ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొం దినా, శాసనమండలిలో వీగిపోయింది. దరిమిలా అదే ఆర్డినెన్స్‌ను రెండోసారి తీసుకొస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్డినెన్స్‌ను ఒకసారే తీసుకురావలసి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.

Updated Date - 2020-10-25T01:46:36+05:30 IST