Meesho: ‘మీషో’ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 22 నుంచి...

ABN , First Publish Date - 2022-09-22T22:15:16+05:30 IST

ఉద్యోగులకు జీతం చెల్లించడం ఏ కంపెనీయైనా చేసే పనే.. కానీ ఉద్యోగుల బాగోగులు, వారి మానసిక స్థితిని గురించి ఆలోచించే కంపెనీలు లేదా సంస్థలు కొన్నే ఉంటాయి.

Meesho: ‘మీషో’ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 22 నుంచి...

న్యూఢిల్లీ : ఉద్యోగులకు జీతం చెల్లించడం ఏ కంపెనీయైనా చేసే పనే.. కానీ  ఉద్యోగుల బాగోగులు, వారి మానసిక స్థితిని గురించి ఆలోచించే కంపెనీలు ఎక్కడో ఒకటి ఉంటుంది. ఆ కోవకే చెందుతుంది ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో (Meesho). ఉద్యోగులను పని ఒత్తిడి నుంచి బయటపడేసి పునరుత్తేజాన్ని అందించడమే లక్ష్యంగా 11 రోజులపాటు సెలవు ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులందరికీ ఈ విశ్రాంతి వర్తిస్తుందని అఫీషియల్‌ వెబ్‌సైట్‌పై వెల్లడించింది. ఉద్యోగుల సంపూర్ణంగా తమ పనికి దూరంగా ఉండి.. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, బిజీగా ఉండే  ఫెస్టివల్ సేల్ (festival sale) తర్వాత ఉద్యోగులు ఈ మేరకు విశ్రాంతి తీసుకోవచ్చునని మీషో వెల్లడించింది.


ఇదే విషయాన్ని మీషో వ్యవస్థాపకుడు, సీటీవో సంజీవ్ బర్న్‌వాల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. చక్కటి మానసిక ఆరోగ్యాన్ని కలిగివుండేందుకు పని జీవన సమతుల్యత(work life balance) చాలా ముఖ్యమన్నారు. ‘‘ వరుసగా రెండవ ఏడాది 11 రోజుల కంపెనీ వ్యాప్త విరామాన్ని ప్రకటించాం. రానున్న పండగ సీజన్‌, పని ఒత్తిడి దృష్ట్యా ఉద్యోగులకు విశ్రాంతి చాలా అవసరం. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు విశ్రాంతి ఇస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. కాగా మీషో గతేడాది కూడా ఉద్యోగులకు ఈ తరహా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.





Updated Date - 2022-09-22T22:15:16+05:30 IST