మేడారం భక్తులకు సకల సౌకర్యాలు

ABN , First Publish Date - 2021-10-31T06:01:49+05:30 IST

మేడారం భక్తులకు సకల సౌకర్యాలు

మేడారం భక్తులకు సకల సౌకర్యాలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

మహా జాతరకు సమగ్ర ఏర్పాట్లు చేసుకుందాం 

రూ.108 కోట్లతో ప్రతిపాదనలు 

రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

రూ.2.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మేడారం, అక్టోబరు 30: మేడారం మహాజాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర స్త్రీ,శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవ తిరాథోడ్‌ అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సార లమ్మలను మంత్రి  శనివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం జాతర ఏర్పాట్లపై ఆమె ఆయా శాఖల అధికారులతో  సమావేశమయ్యారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  రూ.2.24కోట్లతో నిర్మించనున్న కమ్యూనిటీ డైనింగ్‌హాల్‌ షెడ్డు, ఓహెచ్‌ఆర్‌ఎస్‌, విశ్రాంతి గదు లు, దుస్తులు మార్చుకునే గదులు, సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత అనుభవా లను దృష్టిలో పెట్టుకుని 2022 ఫిబ్రవరిలో జరిగే జాతరలో అధికారులు మరింత మెరుగ్గా పనిచేయాలన్నారు. సరిగ్గా జాతరకు వంద రోజులు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. జాతరకు సంబంధించి ఏయే ఇబ్బందులు ఉన్నాయనే విషయాలను ఇప్పటికే గుర్తించినట్టు తెలిపారు. మహాజాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యధిక నిధులు కేటాయిస్తారని అన్నారు. చుట్టుపక్కల జరిగే పిల్ల జాతరలకు కూడా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. గత జాతరకు మంజూరైన రూ.75కోట్ల నిధులతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టినటట్టు తెలిపారు. అందులో భాగంగా  ఓహెచ్‌ఆర్‌సీలు పూర్తి చేసుకున్నామని అన్నారు. ఒకట్రెండు సంఘటనలు మినహా గత జాతరను ఘనంగా నిర్వహిం చుకున్నామని అన్నారు.  ఈసారి కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి అమ్మవార్ల ఆశీస్సులు అందుకుందామన్నారు.  ఇప్పటికే  జాతర అభివృద్ధి పనులపై రూ.120 కోట్ల తో కలెక్టర్‌ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించారని తెలిపారు.  జంపన్నవాగులో మూడు చెక్‌డ్యాంలను తొలగించాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయని అన్నారు. అదనపు బ్లాకులు, నూతన డైనింగ్‌హాళ్లు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇక్కడి నేల స్వభావం వల్ల రోడ్లు కుంగుతు న్నాయని, వాటికి పూర్తి మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. జంపన్నవాగు వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు రెండు గదులు ఏర్పాటు చేయడంతోపాటు పోలీసులకు శాశ్వత వసతులు కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా గుంజేడు ముసలమ్మ జాతర కోసం వసతులు కల్పిస్తామని, పగిడిద్దరాజు దగ్గర కూడా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.  నామినేటెడ్‌ పనులను విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీల ద్వారా ఎక్కువ మంది స్థానిక గిరిజనులు, ఆదివాసీలకు ఇచ్చేవిధంగా చర్యలు చేపడతామన్నారు. అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా పనులు చేపట్టాలన్నారు. ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క మాట్లాడుతూ గత జాతరలలో నెలకొన్న సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మహాజాతరను వైభవంగా నిర్వహించాలన్నా రు. పగిడిద్దరాజు జాతరలో కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా తిరుగువారం జాతర ఏర్పాట్లపై దృష్టిపెట్టి వసతులు కల్పించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బడే నాగ జ్యోతి, కలెక్టర్‌ కృష్ణఆదిత్య, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, ఆర్డీవో రమాదేవి, గిరిజన సంక్షేమశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ హేమలత, డీటీడీవో ఎర్రయ్య, జిల్లా సంక్షేమ  ధికారి ప్రేమలత, ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీవో వసం తరావు, మేడారం ఈవో రాజేందర్‌, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T06:01:49+05:30 IST