ఇలవేల్పులకు ఆదివాసుల వందనం

ABN , First Publish Date - 2022-02-03T05:57:41+05:30 IST

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో భాగంగా ఆదివాసీ మ్యూజి యం ప్రాంగణంలో కోయగిరిజనుల ఇలవేల్పుల సమ్మేళనం కోయతెగ పెద్దలు, పూజారులు ఆర్తివారి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సమ్మేళనం శుక్రవారం వరకు మూడురోజులపాటు జరుగనుంది.

ఇలవేల్పులకు ఆదివాసుల వందనం
ఇలవేల్పులను మ్యూజియం ప్రాంగణంలో నిలుపుతున్న ఆదివాసీలు, ఇలవేల్పులను తీసుకువస్తున్న ఆదివాసీలు

మేడారంలో మొదలైన మూడురోజుల సమ్మేళనం
గుబాళిస్తున్న గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు


మేడారం, ఫిబ్రవరి 2: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో భాగంగా ఆదివాసీ మ్యూజి యం ప్రాంగణంలో కోయగిరిజనుల ఇలవేల్పుల సమ్మేళనం కోయతెగ పెద్దలు, పూజారులు ఆర్తివారి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సమ్మేళనం శుక్రవారం వరకు మూడురోజులపాటు జరుగనుంది. కోయల్లో 3,45,6,7 గొట్టులేక గోత్రాల వారు ఉంటారు. ఈ గోత్రాల వారికి వంశమూల పురుషులు, స్త్రీలు, ఉంటారు. వారిని తమ ఇష్టదైవాలుగా కోయలు పూర్వనుంచి నేటికీ కొలుస్తున్నారు.

ప్రకృతిలో కాలానికి అనుగుణంగా లభించే పండ్లు, ఫలాలను ఆయా రుతువులలో తమ ఇలవేల్పులకు నైవేద్యంగా సమర్పించిన తర్వాతనే కోయలు స్వీకరించే ఆచారం నేటికీ వస్తోంది. ఇలా ప్రతి గోత్రం వారు ప్ర తి సంవత్సరం వేల్పుల పండుగలను మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు నిర్వహించుకుంటారు. గో త్రాల వారీగా ఉన్న ఇలవేల్పులకు చరిత్ర కలిగి ఉంటా రు. కోయలు వారిని స్మరించుకుంటూ డోలువాయిద్యాలతో చరిత్రలు, పురాణాలు, వీరగాథలు, రేలా పాటలతో మౌఖికంగా చెబుతున్నారు. గోత్రాల చరిత్రలను, వారి ఆచార సంప్రదాయాలను తమ తర్వాతి తరాలవారికి అందించే ప్రయత్నమే ఇలవేల్పుల సమ్మేళనం.
ఈ సమ్మేళనానికి ఆయా గొట్టులకు సంబంధించిన వేల్పులు తూలుముత్తి, భీమరాజు, ఘడికమరాజు, నంగ రాజు, బాపనమ్మ, పగిడిద్దరాజు, పిడగరాజు, నాగులమ్మ, రెక్కల రాము, రణసూరుడు, గోవిందరాజు, చిర్రాజులు వేల్పులు వచ్చి ఉన్నాయి. ఈ సమ్మేళనంలో మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఆయా వేల్పుల తలపతులు నాగుల శ్రీరాములు, శ్యామల కాంతారావు, ఊకె చంద్రయ్య, తెల్లం రామయ్య, బెండబోయిన లక్ష్మీనారాయణ, పెసా జిల్లా కోఆర్డినేటర్‌ కొమురం ప్రభాకర్‌, టీడబ్ల్యూటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొదెం కృష్ణప్రసాద్‌, అసిస్టెంట్‌ మ్యూజియం క్యూరేటర్‌ కుర్సం రవి, పరిశోధక విద్యార్థి చందా మహేష్‌, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్‌కుమార్‌, మల్లెల రాంబాబు, ఆదివాసీ సేన రాష్ట్ర బాధ్యులు పొదెం వెంకటేష్‌, కొమురం అనిల్‌కుమార్‌, ఆదివాసీ సీనియర్‌ నాయకుడు చర్ప రవీందర్‌దొర, పెనక ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గుడిమెలిగె

మేడారం మహాజాతర పూజా కార్యక్రమాలకు అంకురార్పణ

మేడారం, ఫిబ్రవరి 2: తాడ్వాయి మండలంలోని మేడారంలో గుడిమెలిగె పండుగను పూజారులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వేకువజామున నిద్రలేచి ఇల్లువాకిలిని శుభ్రపరిచి జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కాలినడకన అడవికి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చారు. ఈక్రమంలో సమ్మక్క గర్భగుడిని శుద్ధి చేశారు. ఆడపడుచులు గుడిని అలుకుపూతలు చేసి రంగుల ముగ్గుల వేశారు. అదేవిధంగా డోలువాయిద్యాల నడుమ తీసుకువచ్చిన గడ్డిని గుడిపై కప్పారు. తర్వాత గర్భగుడిలో సమ్మక్క దేవతకు డోలు వాయిద్యా ల నడుమ దూపదీప నైవేద్యాలు సమర్పిం చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాట మొక్కులు చెల్లించి మొక్కుకున్నారు. అదేవిధంగా కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద కాక సారయ్య, కిరణ్‌ల ఆధ్వర్యంలో గుడిమెలిగే పం డుగ నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సి ద్దబోయిన జగ్గారావు, పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ కొర్నిబెల్లి శివయ్య, పూజారులు, అధికారులు పాల్గొన్నారు.

మేడారం జాతర స్పెషల్‌ ఆఫీసర్‌గా ఆర్‌వీ కర్ణన్‌?
గత రెండు జాతరలను సక్సెస్‌ చేసిన అనుభవం


భూపాలపల్లి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మేడారం మహజాతరకు స్పెషల్‌ ఆఫీసర్‌గా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ను నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్యతో పాటు అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవి.గణే్‌షలకు కూడా జాతరలో పెద్దగా అనుభవం లేకపోవటంతో జాతర నిర్వహణపై పట్టుఉన్న కర్ణన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించవచ్చునని సమాచారం.  

2018 జనవరిలో అప్పటి ఉమ్మడి భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి బదిలీ కావటంతో మంచిర్యాల కలెక్టర్‌గా ఉన్న ఆర్‌వీ కర్ణన్‌కు భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జనవరి 31నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతరను కర్ణన్‌ సక్సెస్‌ చేశారు. అలాగే 2020లోజనవరిలో అప్పటి ములుగు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి నిజామాబాద్‌ జిల్లాకు బదిలీపై వెళ్లగా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా ఉన్న కర్ణన్‌ను ములుగు జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించా రు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన మహజాతరను కర్ణన్‌ విజయవంతం చేశారు.

ఇదే సమయంలో ఫిబ్రవరి 2వ తేదీన ములుగు జిల్లా కలెక్టర్‌గా కృష్ణఆదిత్యకు పోస్టింగ్‌ ఇచ్చినప్పటికి చార్జీ ఇవ్వకుండా కర్ణన్‌ నేతృత్వంలోనే మే డారం జాతరను విజయవంతం చేశారు. ప్రస్తుతం ములుగు చిన్న జిల్లా కావటం, జాతర నిర్వహణపై కలెక్టర్‌గా పెద్దగా అనుభవం లేకపోవటంతో మరోసారి కర్ణన్‌ను జాతర కోసం నియమించవచ్చునని సమాచారం.

నేడు మేడారానికి వైఎస్‌ షర్మిల రాక

ములుగు, ఫిబ్రవరి 2: వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎ్‌స.షర్మిల గురువారం తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోకున్నారు. ఈమేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చే స్తున్నారు. తాడ్వాయి మండలం నార్లాపూర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వనదేవతల గద్దెలను దర్శించుకుంటారని జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. సంప్రదాయపద్దతిలో మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆదివాసీ ఇలవేల్పుల సమ్మేళనంలో పాల్గొంటారని వెల్లడించారు.



Updated Date - 2022-02-03T05:57:41+05:30 IST