మేడారం జాతరకు 3,845 బస్సులు : టీఎస్ ఆర్టీసీ

ABN , First Publish Date - 2022-02-14T00:26:42+05:30 IST

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ 3,845 ప్రత్యేక బస్సులను నడపనుంది.

మేడారం జాతరకు 3,845 బస్సులు : టీఎస్ ఆర్టీసీ

హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ 3,845 ప్రత్యేక  బస్సులను నడపనుంది. ఈమేరకు జాతర జరిగే నాలుగు రోజుల్లో 21 లక్షల మందిని భక్తులను జాతరకు తరలించే అవకాశం వుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. మేడారం వద్ద 50 ఎకరాల స్థలంలో ఆర్టీసీ తాత్కాలిక బస్ స్టాండ్ ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. అలాగే బస్సుల పార్కింగ్ కోసం తాడ్వాయి వద్ద 5 ఎకరాల స్థలాన్ని సేకరిస్తున్నట్టు తెలిపారు.


జాతర సందర్భంగా 12వేల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీ 33 కోట్ల రూపాయలను ఆర్జించాలని టార్గెట్ గా పెట్టుకుంది. నాలుగు రోజుల జాతరలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్, చత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది హాజరయ్యే అవకాశం వుందని భావిస్తున్నారు. జాతర జరిగే నాలుగు రోజులకుగాను మేడారం, పరిసర గ్రామాల్లో  దాదాపు 10 లక్షల మంది తాత్కాలిక గుడారాలను, షెడ్లను నిర్మించుకునే అవకాశం వుంది. 

Updated Date - 2022-02-14T00:26:42+05:30 IST