మినీ కుంభమేళాగా మేడారం జాతర

ABN , First Publish Date - 2022-01-30T08:06:57+05:30 IST

సమ్మక్క, సారాలమ్మ కొలువైన మేడారం మహాజాతరను మినీ కుంభమేళాగా వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

మినీ కుంభమేళాగా మేడారం జాతర

  • రాష్ట్రం ఏర్పడ్డాకే  భారీగా నిధులు  
  • 6 ఏళ్లలో 350 కోట్లకు పైగా కేటాయింపులు
  • జాతరలో పక్కాగా కొవిడ్‌ నిబంధనల అమలు
  • 4 వేల బస్సులు, 10 వేల మంది పోలీసులు 
  • శాఖల సమన్వయంతో సక్సెస్‌ చేస్తాం
  • రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • ఎర్రబెల్లి, సత్యవతిలతో కలిసి పర్యటన 


భూపాలపల్లి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సమ్మక్క, సారాలమ్మ కొలువైన మేడారం మహాజాతరను మినీ కుంభమేళాగా వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దేశంలో కుంభమేళాకు ఎంత ప్రాముఖ్యం ఉందో అదే స్థాయిలో మేడారం మహాజాతరపై భక్తుల్లో విశ్వాసం ఉందన్నారు. మినీ కుంభమేళాగా మేడారం జాతరను నిర్వహించేందుకు ప్రభు త్వం సకల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. తెలంగాణ  ఏర్పడ్డాక మేడారం జాతరకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.350 కోట్లకు పైగా కేటాయించామని వెల్లడించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆయన శనివారం పర్యటించారు. మహాజాతరలో అభివృద్ధి పనులపై వివిధ శాఖ ల అధికారులతో మంత్రులతో కలిసి సమీక్షించారు. ఆనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  


 భక్తులను జాతరకు తరలించేందుకు 4 వేల ఆర్టీసీ బ స్సులు, 10వేల మంది ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు సి ద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. జాతరలో కీలకమైన పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలను సమన్వ యం చేసుకుంటూ జాతరను సక్సెస్‌ చేసేందుకు ప్ర యత్నాలు చేస్తున్నామని తెలిపారు. జంపన్నవాగులో గతంలో చెక్‌డ్యామ్‌ల వల్ల ప్రమాదాలు జరిగి, ప్రాణనష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం చెక్‌డ్యామ్‌లను తొలగించామని, వాగులో మూడు ఫీట్ల ఎత్తులో మాత్రమే ప్రవాహం ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు.  దేశం నలుమూలల నుంచి కోటి 30 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని   మంత్రి ఎర్రబెల్లి  పేర్కొన్నారు. జాతరను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని,  భక్తులకు సకల సౌకర్యాలు క ల్పిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రా థోడ్‌ పేర్కొన్నారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతోనే జాతర విజయవంతమవుతుందని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అన్నారు. జాతరలో 10వేల మంది పోలీసులు విధులునిర్వర్తిస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు .


 తల్లులకు మంత్రుల మొక్కులు

 మేడారంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ సమ్మక్క, సారలమ్మల ను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని కోరుకున్నారు. 


 పునరుద్ధరణ కమిటీ బాధ్యతల స్వీకరణ

 సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద శనివారం మేడా రం మహాజాతర పునరుద్ధరణ కమిటీ బాధ్యత స్వీకరణ జరిగింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో క మిటీ చైర్మన్‌ కొర్నిబెల్లి శివయ్యతో 13 మంది సభ్యులు బాధ్యతలు సీవకరించారు. కాగా మేడారం మహాజాత ర పునరుద్ధరణ కమిటీలో ఆదివాసీలనే నియమించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ (ఏఎస్‌పీ) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జాతర అభివృద్ధి పనులపై సమీక్ష జరుగుతుండగా నిరసనకు దిగారు.  ఏఎస్‌పీ మ హిళ నేతలు సమంత, వాణి మాట్లాడుతూ  మేడా రం మహాజాతరకు శాశ్వత కమిటీని వంద శాతం ఆదివాసీలతో నియమించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-01-30T08:06:57+05:30 IST