మేడారంలో భక్తులపై తేనెటీగల దాడి

ABN , First Publish Date - 2021-04-17T05:42:28+05:30 IST

మేడారంలో భక్తులపై తేనెటీగల దాడి

మేడారంలో భక్తులపై తేనెటీగల దాడి

మేడారం, ఏప్రిల్‌ 16 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై తేనెటీగలు దాడిచేసిన ఘటన శుక్రవారం జరిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రాళ్లకుంటకు చెందిన రామనర్సయ్య, వెంకటమ్మ, బొజ్జం రాజు, వెల్లబోయిన రవి బంధుమిత్రులతో కలిసి మేడారం చేరుకున్నారు. వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం, చిలుకలగుట్ట ప్రాంతానికి వంట చేసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ చెట్టుపై ఉన్న తేనెటీగలు వారిపై దాడిచేసి, నలుగురిని గాయపరిచాయి. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్‌ అవినాష్‌ సంఘటన వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స జరిపించి, కల్యాణ మండపంలోని తాత్కాలిక ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్‌ ముల్కనూరి శ్రీనివాస్‌ ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. 

Updated Date - 2021-04-17T05:42:28+05:30 IST