రష్యాకు... మెక్డొనాల్డ్స్... టాటా...
ABN , First Publish Date - 2022-05-16T23:51:49+05:30 IST
తన రష్యన్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు మెక్డొనాల్డ్స్ సోమవారం తతెలిపింది.
చికాగో : తన రష్యన్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు మెక్డొనాల్డ్స్ సోమవారం తతెలిపింది. దేశంలో 32 సంవత్సరాల తర్వాత రష్యా నుండి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ నిష్క్రమణ ఇది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని మెక్డొనాల్డ్ ఈ సందర్భంగా ఉదహరించింది, రష్యన్ వ్యాపారం ఇకపై సమర్థనీయం కాదని, అది మెక్డొనాల్డ్ విలువలకు అణుగుణంగా లేదని పేర్కొంది. రష్యాలో మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లు 850 వరకు ఉన్నాయి, వాటిలో 62 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.