Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితారాణా

షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితారాణా

మహబూబాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రగతిని సాధించాలని రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితారాణా అన్నారు.  జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సంక్షేమ హాస్టళ్లు, పోస్ట్‌ ఫ్రీమెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలపై ములుగు, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ జిల్లాకు మంజూరు చేసిన రూ.కోటి నిధుల నుంచి సుమారు రూ.94 లక్షలు ఖర్చు చేశారని, మిగులు నిధులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వసతిగృహాల్లో బయోమెట్రిక్‌లు పని చేయడం లేదని, వెంటనే మరమ్మతులు చేయించి హాజరును నమోదు చేయాలన్నారు. హాస్టల్‌ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించి సొంత ఇంటిలో ఉన్నామనే భావన కలిగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పిల్లలు మాస్క్‌లు ధరించే విధంగా శానిటైజేషన్‌ చేసుకునే విధంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతీ హాస్టల్‌లో మెష్‌డోర్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, 10వతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందేవిధంగా ప్రతి రోజు రాగిలడ్డు, పల్లీ పట్టీలు అందించాలన్నారు. పౌష్టికాహారాన్ని స్వయం సహాయక సంఘాలతో తయారు చేయాలని సూచించారు.  

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు (హెచ్‌డబ్ల్యూవో) తమకు కేటాయించిన పోస్ట్‌, ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లు విద్యార్ధులకు అందేలా చూడాలన్నారు. 2017-18, 2018-19, 2020-21 విద్యా సంవత్సరాలకు సంబంధించి కాలేజీల పెండింగ్‌  పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల కోసం డిసెంబర్‌ 15లోగా పూర్తి చేయాలన్నారు. ఈపాస్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో రెన్యూవల్‌, రిజిస్ట్రేషన్లను చేసుకొని వారిని కాలేజీల వారీగా గుర్తించి వెంటనే చేయించాలన్నారు. జిల్లాల వారీగా పోస్ట్‌, ప్రీమెట్రిక్‌పై సమీక్షించారు. కులాంతర వివాహాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు హాస్టళ్లను తనిఖీ చేసిన సమయాల్లో తప్పనిసరిగా కిచెన్‌, స్టోర్‌ రూంలను పరిశీలించాలన్నారు. వసతిగృహాల్లో అవసరమయ్యే కరివేపాకు, ఉసిరి, నిమ్మ, జామ వంటి మొక్కలను పెంచాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ హన్మంతునాయక్‌, కలెక్టర్‌ శశాంక, ఉప సంచాలకులు రమాదేవి, జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ 

Advertisement
Advertisement